అడ్డు అదుపు లేకుండా ఉన్న 'ఎఫ్‌ 2' కలెక్షన్స్‌... జనాలకు మరీ ఇంత పిచ్చేంటీ?

వెంకటేష్‌, తమన్నా, వరుణ్‌ తేజ్‌, మెహ్రీన్‌ లు నటించిన ఎఫ్‌ 2 చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి.ఆ నాలుగు సినిమాల్లో మిగిలిన మూడు సినిమాలు వచ్చిన సంగతి కూడా మర్చి పోయారు.

ఎక్కడ కూడా థియేటర్లలో కనిపించడం లేదు.కాని ఎఫ్‌ 2 మాత్రం ఇంకా పలు థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకు పోతుంది.

మల్టీస్టారర్‌ సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులు ఇంతగా ఆధరిస్తున్నారని కొందరు భావిస్తున్నారు.ఈ చిత్రం అందరి జీవితాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ స్థాయిలో వసూళ్లు చేస్తుంది.

Advertisement

ఎఫ్‌ 2 చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు, భార్య భర్తల అనుబంధం గురించి చూపించారు.ఆ కారణంగానే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు.మామూలుగా అయితే ఈ చిత్రంలో పెద్దగా కాన్సెప్ట్‌ లేదు, కనీసం స్క్రీన్‌ప్లే కూడా సరిగా లేదు.

కాని కామెడీ మాత్రం చాలానే ఉంది.దానికి తోడు భార్యభర్తల మద్య సీన్స్‌ బాగుండటం వల్ల ఈ చిత్రంను జనాలు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

భారీ ఎత్తున ఈ చిత్రం వసూళ్లను రాబడుతూ అందరిని ఆశ్చర్య పర్చుతుంది.

ఈ చిత్రం సంక్రాంతికి వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 50 కోట్ల సాధిస్తే గొప్ప అనుకున్నారు, కాని రెండు వారాల తర్వాత ఈ చిత్రం 75 కోట్లను దాటింది.మరో వారం నుండి రెండు వారాల పాటు ఈ చిత్రం జోరు కొనసాగే అవకాశం ఉంది.అంటే మరో పాతిక కోట్లతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం చాలా ఈజీ అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలంటే జనాలకు ఎంత పిచ్చో ఈ సినిమా ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు