వావ్, రంగులు మార్చుతున్న హమ్మింగ్ బర్డ్.. వీడియో చూస్తే ఫిదా!

హమ్మింగ్ బర్డ్స్ చాలా అందమైన చిన్న పక్షులు.వీటిలో సూరకవ్ అనే ఒక రకమైన హమ్మింగ్ బర్డ్ తన కలర్ చేంజ్ చేస్తూ ఉంటుంది.

అందుకే దీనిని కలర్ చేంజింగ్ బర్డ్ అని కూడా పిలుస్తారు.ఈ పక్షులను ప్రత్యక్షంగా చూస్తే అబ్బుర పడటం ఖాయం.

అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.ఈ వీడియోని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్ హాగ్ షేర్ చేసింది.

ఈ వీడియో కాస్త బీభత్సంగా వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక హమ్మింగ్ బర్డ్ ఒక వ్యక్తి చేతి బొటనవేలు పై కూర్చుని ఉండటం చూడొచ్చు.

Advertisement

పొడవాటి ముక్కు, చిన్నపాటి శరీరం, ఆకుపచ్చ కలర్ ఈ పక్షిలో ఆకర్షణీయంగా కనిపించాయి.అయితే వీటన్నింటికంటే మరొకటి బాగా అట్రాక్టివ్‌గా కనిపించింది.

అదేంటంటే దీని మెడ చుట్టూ, తలపై ఉన్న కలర్‌ఫుల్ భాగం.ఈ పక్షి తన మెడను వేరే వైపు తిప్పినప్పుడు మెడ నుంచి తల వరకు పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది.

మళ్లీ వేరే వైపు తిప్పినప్పుడు అది బ్లాక్ కలర్‌లో ఉండిపోతుంది.ఇది చూసేందుకు ఒక మాయాజాలం లాగానే అనిపించింది.

ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

నిజానికి ఈ పక్షి తన రంగును మార్చలేదు.కాకపోతే దాని మెడపై నుంచి ఉన్న భాగాలలో బహు వర్ణాలతో కూడిన ఈకెలు ఉంటాయి.డిఫరెంట్ యాంగిల్స్ లో చూసినప్పుడు ఈ ఈకెలు ఒక కొత్త రంగుని సృష్టిస్తాయి.

Advertisement

అందుకే ఇవి కలర్ చేంజ్ చేసినట్లు కనిపిస్తాయి.ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసి వావ్ బ్యూటిఫుల్, అమేజింగ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ అద్భుతమైన వీడియోని మీరు కూడా వీక్షించండి.

తాజా వార్తలు