ఉపవాసం వున్నవారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన CEO.. అలా చేస్తే రూ.10 లక్షల రివార్డు!

అవును, మీరు విన్నది నిజమే.కానీ ఈ అవకాశం అందరికీ కాదు సుమా.

కేవలం ఆ కంపెనీ ఉద్యోగులకు మాత్రమే.ఇంతకీ ఏ కంపెనీ.

CEO ఎవరు? దాని కధేమిటి? అని తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ఆన్‌లైన్‌ బ్రోకింగ్ కంపెనీ అయినటువంటి జెరోదా CEO నితిన్‌ కామత్‌ తన ఉద్యోగులకు ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు.

అదేమంటే, ఫిట్‌నెస్ ట్రాకర్స్ మీద డైలీ యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేసుకొని, వాటిని సాధించిన వారికి ఒక నెలబోనస్ జీతం అందిస్తామని తాజాగా వెల్లడించారు.ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ.

Advertisement

ప్రతి మనిషి క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటిస్తూ జీవనం సాగించినపుడే యాక్టివ్ గా ఉండి, ముందుకెళ్తారని చెప్పుకొచ్చారు.ఇకపోతే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.

వర్కఫ్రంహోమ్‌లో భాగంగా ఎక్కువ సేపు అలాగే కుర్చీలో కూర్చోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.రానురాను ఇది అంటు వ్యాధిగా మారుతోందని, అందుకే ఉద్యోగుల కోసం ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను తీసుకువచ్చినట్లు కామత్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఉద్యోగులు రోజువారి లక్ష్యాన్ని 90% పూర్తి చేయాలనీ, వచ్చే సంవత్సరం నాటికి ఎవరు లక్ష్యాలను చేరుకుంటారో వారికి రివార్డులు లభిస్తాయని అన్నారు.వారికి నెల జీతం బోనస్‌గా ఇవ్వడమే కాకుండా ఒక లక్కీ డ్రాను నిర్వహించి అందులో విజేతగా నిలిచిన వారికి రూ.10 లక్షల రివార్డును కూడా అందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.కాగా ఈ విషయాన్ని నితిన్‌ కామత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అతను ఆరోగ్యంగా ఉండేందుకు పాటిస్తున్న దినచర్యలు వెల్లడించారు.ఈ విషయం చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఈ CEOని ఆకాశానికెత్తేస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement