తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదంపై కేంద్రం ఫోకస్

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో సమావేశానికి హాజరు కావాలని తెలుగు రాష్ట్రాల సీఎలస్ లు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, కేంద్ర జలసంఘం, కేఆర్ఎం ఛైర్మన్ కు కేంద్రం పిలుపునిచ్చింది.జలసంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్ లు కూడా నేరుగా భేటీకి హాజరు కావాలని సూచించింది.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై అధికారులు చర్చించనున్నారు.కాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు