ప్ర‌జ‌ల కోరుకున్నందుకే మునుగోడుకు ఉపఎన్నిక‌..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌భ‌తో తెలంగాణ రాజ‌కీయాల్లో పెను మార్పులు వ‌స్తాయ‌ని ఎంపీ డా.ల‌క్ష్మణ్ తెలిపారు.

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులో త‌న‌కు చోటు ద‌క్క‌డ‌మ‌నేది సామాన్య కార్య‌క‌ర్త‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని వ్యాఖ్య‌నించారు.రాష్ట్రంలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

అనంత‌రం ప్ర‌జ‌లు కోరుకున్నందుకే మునుగోడుకు ఉపఎన్నిక వ‌చ్చింద‌ని తెలిపారు.దుబ్బాక‌, హుజురాబాద్ ఫ‌లితాలే మునుగోడులోనూ పున‌రావృతం అవుతాయ‌ని జోస్యం చెప్పారు.

బీజేపీ అంటే టీఆర్ఎస్ కు భ‌యం ప‌ట్టుకుందని విమ‌ర్శించారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు