తుపాకీతో పెళ్లికూతురు ఫోజులు.. కాసేపటికే ఊహించని షాక్

పెళ్లి( wedding ) అనగానే ఎన్నో సరదా సంఘటనలు జరుగుతుంటాయి.ముఖ్యంగా భారత దేశంలో వివాహ వేడుకలు సందడిగా సాగుతాయి.

నిశ్చితార్ధం, ప్రధానం, మెహెందీ ఫంక్షన్, బ్యాచిలర్స్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వేడుకలన్నీ చాలా ఆడంబరంగా జరుగుతుంటాయి.ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్స్( Pre wedding photoshoots ), పెళ్లి వేడుకలలో ఫొటోషూట్స్ మామూలు అయిపోయాయి.

సాధారణంగా కాకుండా విభిన్నంగా ఫొటోషూట్స్ తీసుకోవాలని అంతా భావిస్తున్నారు.దీని కోసం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ ను నియమించుకుని, లక్షల కొద్దీ డబ్బులిచ్చి ఫొటోలు తీయించుకుంటున్నారు.

అయితే కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి.తాజాగా ఇదే కోవలో ఓ ఫొటోషూట్ లో ప్రమాదం జరిగింది.

Advertisement

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రిసెప్షన్ వేడుక( Reception ceremony )లో వధూవరులు ఫొటోలకు ఫోజులు ఇస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది.వధూవరులిద్దరూ గన్స్ పట్టుకుని జేమ్స్ బాండ్ తరహాలో ఫొటోగ్రాఫర్ చెప్పినట్లు ఫోజులు ఇచ్చారు.బొమ్మ తుపాకీలను పేల్చగానే అందులో నుంచి మెరుపులు వస్తాయి.

దీంతో ఫొటోలు మరింత అందంగా ఉంటాయని, తమకు మర్చిపోలేని గుర్తుగా ఉంటాయని వారు భావించారు.అయితే వారి చేతిలో ఉన్న బొమ్మ తుపాకీ పేలి ఒక్కసారిగా పొగ, మంటలు అలముకున్నాయి.

దీంతో వధువు ముఖం మొత్తం కాలిపోయింది.నిప్పురవ్వలు ఎగసి పడి వారి దుస్తులకు అంటుకున్నాయి.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

అయితే వెంటనే ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో పెద్దగా గాయాలు కాలేదు.ఇది మహారాష్ట్రలో జరిగినట్లు సమాచారం.

Advertisement

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా బాగా వైరల్ అవుతోంది.వివాహాల్లో ఫొటోషూట్స్‌ మంచిదేనని కాకపోతే ఇలాంటి రిస్క్‌లు చేయడం అవసరమా అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కనీసం ఇలాంటివి చూసినప్పుడైనా కొందరు తమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.