డేర్ డెవిల్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన వధువు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు...

ఈ రోజుల్లో వధూవరులు పెళ్లి మండపంలోకి వెరైటీగా రావడానికి బాగా ఇష్టపడుతున్నారు అందుకోసం రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు.

కొందరైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ వరదల్లో పండిబోర్లుతున్నారు.

మరి కొందరు రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదు.తాజాగా పెళ్లి వేడుకలలో ఓ వధువు షాకింగ్ స్టంట్ చేసింది.

ఆమె ఈ విన్యాసం చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయింది.ఆ వీడియో ప్రకారం, వధువు అందమైన వైట్ వెడ్డింగ్ డ్రెస్ ధరించి తాడు నుంచి కిందికి దూకింది.

ఆమె కొద్దిగా స్లోగా అయినా నేరుగా కిందకి దిగగలిగింది.దిగిన తర్వాత ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తుంది.

Advertisement

ఆమె దుస్తులు, వెంట్రుకలు, వెడ్డింగ్ వీల్ అస్సలు కదలలేదు.ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో వీడియోలో చెప్పలేదు.

కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.

చాలా మంది ఈ బ్రైడ్ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు.మరికొంతమంది ఈ పెళ్లికూతురు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని కామెంట్లు చేస్తూ వీడియో లైక్ చేసారు.వెడ్డింగ్ పిక్చర్స్‌ పంచుకునే ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దీనిని షేర్ చేశాయి.

వధువు సర్కస్‌లో పనిచేస్తుందేమో అందుకే అలా ఎంట్రీ ఇచ్చింది అని ఒక వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

వధువు పేరు పిప్పా రోజీ అని ఆమెకు స్కైడైవ్ చేయడం ఇష్టం అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.ఏదేమైనా సరదా కోసం చేసే ఈ ఎంట్రీలు బెడిసి కొడితే పెళ్లి రోజు కాస్త ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉంది.అందుకే ఇలాంటివి ప్లాన్ చేసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు