మీ రాశి ప్రకారం మీ బలహీనతలు తెలుసుకోండి

కొంత మంది అవతలి వారు ఏమి చెప్పిన చాలా తొందరగా నమ్మేస్తూ ఉంటారు.ఆలా నమ్మేసి ఆ తర్వాత తీరిగ్గా బాధ పడుతూ ఉంటారు.

ఇలా జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి.ఒక్కో రాశి వారికీ ఒక్కో బలహీనత ఉంటుంది.

ఆ బలహీనతలు తెలుసుకుంటే దానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.ఇప్పుడు ఆ బలహీనతల గురించి వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండుట వలన పక్కన జరిగే విషయాలను నియంత్రణ చేయాలని అనుకుంటారు.దాంతో కాస్త ఇబ్బందుల్లో పడతారు.

Advertisement

వృషభ రాశి ఈ రాశివారు చాలా నమ్మకంగా,స్థిరంగా ఉంటారు.వీరు లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళితే వీరికి తిరుగు ఉండదు.

మిధున రాశి వీరు ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండరు.నిమిష నిమిషానికి ఆలోచనలు మారుతూ ఉంటాయి.

వీరు ఉద్యోగం విషయం గాని, కుటుంబ విషయం కానీ ఒక నిర్ణయం మీద ఉండలేరు.కర్కాటక రాశి ఈ రాశివారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ.

వీరు వాటిని ఒక్కసారిగా బయట పెట్టేస్తూ ఉంటారు.అవతలి వారు చిన్న మాట అన్నా వెంటనే హార్ట్ అయ్యిపోతు ఉంటారు.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....

పక్కవారిని అసలు నమ్మరు.అలాగే వీరికి నిరాశ కూడా ఎక్కువే.సింహ రాశి ఈ రాశివారికి గర్వం,అహంకారం రెండు ఎక్కువే.వీరి గర్వం కారణంగా చాలా మంది వీరికి దూరం అవుతూ ఉంటారు.వీరు గర్వం తగ్గించుకుంటే హ్యాపీగా ఉండవచ్చు.

Advertisement

కన్య రాశి ఈ రాశివారికి మేధస్సు ఎక్కువగా ఉండి ఏ సమస్యను అయినా ఇట్టే పరిష్కరించగల నేర్పు ఉంటుంది.కానీ వాయిదా వేయటం వలన ఆ సమస్యను పరిష్కారం చేయలేరు.

తుల రాశి ఈ రాశివారు ప్రశాంతంగా,శాంతియుతంగా ఉంటారు.అయితే ఒక్కసారిగా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది.

దాంతో సహనం కోల్పోయి అందరిని దూరం చేసుకుంటారు.వృశ్చిక రాశి వృశ్చికరాశి వారు ఎక్కువగా రొమాంటిక్ గా ఉంటారు.

వీరు శృంగార సంబంధాలు కూడా కలిగి ఉంటారు.దీని కారణంగా వీరు చాలా సార్లు ఇబ్బందుల్లో పడతారు.

ధనస్సు రాశి ఈ రాశివారికి సహనం,ఓర్పు తక్కువగా ఉండటం వలన తరచుగా బోర్ ఫిల్ అవుతూ ఉంటారు.వీరు అసలు ఎదుటి వారు చెప్పేది అసలు వినరు.

మకర రాశి ఈ రాశివారు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.డబ్బు సంపాదన కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు.

చిన్న పని చేసి గొప్పగా చెప్పుకుంటారు.డబ్బు సంపాదనలో పడి చిన్న చిన్న సరదాలను కూడా కోల్పోతారు.

కుంభ రాశి ఈ రాశివారికి చాలా భావోద్వేగాలు ఉంటాయి.అయితే వాటిని బయటకు చెప్పుకోలేరు.

మనస్సులోని విషయాన్నీ బయటకు చెప్పుకోరు.మీన రాశి మీనరాశి వారికి కూడా భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి.

అయితే వీరు వ్యక్తపరుస్తారు.వీరిలో సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది.

కానీ దాన్ని వెలికితీయడంలో ఇబ్బందులు పడుతుంటారు.

తాజా వార్తలు