మీ పిల్ల‌లు ఫ్రూట్స్‌ను తిన‌డం లేదా? అయితే ఇలా చేయండి!

ఫ్రూట్స్(పండ్లు).వీటి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

పండ్లు చ‌క్క‌టి రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

ఆరోగ్య ప‌రంగా పండ్లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అందుకే రోజుకు క‌నీసం రెండు ర‌కాల పండ్ల‌ను అయినా తీసుకోవాలి.అయితే పిల్ల‌లు ఫ్రూట్స్‌ను తిన‌డానికి మారాం చేస్తుంటారు.

ఎంత న‌చ్చ‌చెప్పినా పండ్ల‌ను తినేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.బ‌ల‌వంతంగా పెట్టాల‌ని చూసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Advertisement

అయితే పండ్ల‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఇస్తే పిల్ల‌లు చ‌క్క‌గా తీసుకుంటారు.మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా ఒక మామిడి పండు, ఒక అర‌టి పండు, చిన్న బొప్పాయి ముక్క‌, చిన్న పైనాపిల్ ముక్క‌, హాఫ్ యాపిల్, అర కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండు నుంచి గింజ‌ల‌ను వేరుచేసుకోవాలి.

ఇప్పుడు అన్ని పండ్ల‌ను ఒక బౌల్‌లో వేసి స్మాషర్ సాయంతో మెత్త‌గా స్మాష్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో రెండు గ్లాసుల బాదం పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల‌ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ సిర‌ప్ వేసి బాగా క‌లిపితే ఫ్రూట్ మిక్చ‌ర్ సిద్ధం అవుతుంది.

అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉండే ఈ ఫ్రూట్ మిక్చ‌ర్‌ను పిల్ల‌ల‌కు ఇస్తే హాయిగా తాగేస్తారు.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

పెద్ద‌లు కూడా ఈ హెల్తీ ఫ్రూట్ మిక్చ‌ర్‌ను తీసుకోవ‌చ్చు.త‌ద్వారా శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది.

Advertisement

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్ అవుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మ ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

తాజా వార్తలు