కిడ్నీల ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే.. కచ్చితంగా వీటిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే..

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ముఖ్యమైన భాగం.ఇది శరీరంలో అనేక రకాల ముఖ్యమైన పనులను చేస్తాయి.

ఇవి శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ ఉంటాయి.ఒక విధంగా చెప్పాలంటే శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేయడంలో ఇది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.లేకపోతే ఎన్నో రకాల అనర్ధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలామందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు కూడా తెలియదు.తెలుసుకునే సమయానికే కిడ్నీలు పాడైపోయి ఉంటాయి.

Top Best Foods For Kidneys,kidneys,kidney Health,kidney Disease,best Foods,red C
Advertisement
Top Best Foods For Kidneys,Kidneys,Kidney Health,Kidney Disease,Best Foods,Red C

ఫలితంగా పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.అందుకే కిడ్నీలని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఎంతో అవసరం.అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

మరి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటు విటమిన్ b6, పోలిక్ యాసిడ్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

అందుకోసం ఇవి కిడ్నీలకు ఎంతగానో ఉపయోగపడతాయి.వెల్లుల్లిని భారతీయ వంట గదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

వెల్లుల్లిలో మాంగనిస్, విటమిన్ సి, విటమిన్ బి6 పోషకాలు ఎన్నో ఉన్నాయి.ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Top Best Foods For Kidneys,kidneys,kidney Health,kidney Disease,best Foods,red C
రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

వంటలకు అదనపు రుచిని అందించడానికి ఉల్లిపాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా ఉల్లిపాయని ఆహారంలో చేర్చుకోవడం కూడా ఎంతో ముఖ్యం.పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు, జింక్ వంటి పోషకాలు ఆపిల్ లోకుడా ఎన్నో ఉంటాయి.

Advertisement

ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే గ్లూకోస్థాయిని నియంత్రించడంలో ఎంతో సహాయ పడతాయి.

వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

కిడ్నీల ఆరోగ్యానికి ముల్లంగి కూడా ఎంతో మంచిది.ఇందులో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ కిడ్నీలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

తాజా వార్తలు