ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికిపందచర్య..ముద్రగడ పద్మనాభం

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికిపందచర్య దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు.

ముద్రగడను కలిసిన పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య, వీవర్స్,వైసీపీ నాయకులు.

మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం .కిర్లంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం పెద్దలు, వీవర్స్, వైసీపీ నేతలు ముద్రగడను కలిసి వైసిపి విజయానికి కృషి చేస్తామని ముద్రగడక హామీ ఇచ్చారు.ఆర్యవైశ్య సంఘం పెద్దలు, చేనేత కార్మిక సంఘాల నేతలు, వైసీపీ నేతలు ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ వైసిపి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పిరికి పంద చర్యఅని ముద్రగడ మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో వాళ్లతో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.బస్సు యాత్రకు వస్తున్న విశేషాలు చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని ఇటువంటి ఘటనపై ప్రజలందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఉందన్నారు మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అని ముద్రగడ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

Advertisement
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు