18 క్యారెట్స్‌ గోల్డ్ టాయిలెట్‌, వెళ్లేందుకు జనాలు క్యూ.. ఇది దాని ప్రత్యేకత

డబ్బు ఎక్కువ ఉన్న వారు తమ జీవనంను అత్యంత లగ్జరీగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు.

లగ్జరీ అంటే అత్యంత ఖరీదైన ఇల్లు, ఖరీదైన ఫర్నీచర్‌, అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడుతారు.

ఇక ఇంట్లో ఇటాలియన్‌ మార్బుల్స్‌, అత్యంత విశాలమైన గదులు నిర్మాణం చేసుకుంటారు.

ఇక బాత్‌ రూం చాలా విశాలంగా నిర్మాణం చేసుకోవడం, అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటారు తప్ప, టాయిలెట్‌ను బంగారంతో మాత్రం ఎవరు నిర్మించుకోరు.ఇండియాలో బంగారం అంటే దేవుడితో సమానంగా చూస్తారు.కాని అమెరికాలో మాత్రం అలా కాదు, అమెరికాలో బంగారంను ఒక ప్రాపర్టిగా చూస్తారు.

ఎలా వచ్చిందో ఏమో కాని అమెరికాలోని గుగ్గెన్‌హైమ్‌ మ్యూజియం వారికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది.అదే గోల్డెన్‌ టాయిలెట్‌.ఇండియాలో గొల్డెన్‌ టెంపుల్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో, గుగ్గెన్‌హైమ్‌ మ్యూజియంలో గోల్డెన్‌ టాయిలెట్‌ అంత ఫేమస్‌ అయ్యింది.

Advertisement

న్యూయార్క్‌ వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యూజియంలోని గోల్డెన్‌ టాయిలెట్‌ను చూడాలనుకుంటున్నారు.

మ్యూజిక్‌లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్డెన్‌ టాయిలెట్‌ ఎక్కడ అని తమ కళ్లతో వెదికేస్తూ ఉన్నారట.ఆ గోల్డెన్‌ టాయిలెట్‌కు భారీ క్రేజ్‌ దక్కడంతో మ్యూజియంలో అడుగు పెట్టిన చార్జ్‌తో పాటు గోల్డెన్‌ టాయిలెట్‌కు ప్రత్యేక చార్జ్‌ వసూళ్లు చేస్తున్నారట.18 క్యారెట్స్‌ బంగారంతో తయారు చేసిన ఈ గోల్డెన్‌ టాయిలెట్‌ బేసిన్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఆ మద్య ఈ గోల్డెన్‌ టాయిలెట్‌ను ట్రంప్‌ కావాలంటున్నాడని, ఆయనకు గోల్డెన్‌ టాయిలెట్‌పై మనసు పడ్డట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆ విషయంపై వైట్‌ హౌస్‌ పుకార్లను కొట్టి పారేస్తూ ప్రకటన చేసింది.ఎన్నో రకాల కథలు ఈ గోల్డెన్‌ టాయిలెట్‌ గురించి స్థానికంగా చెబుతూ ఉంటారు.

మ్యూజియం నిర్వాహకులు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో దీన్ని ఉంచారు తప్ప, చారిత్రాత్మకత ఏమీ లేదని కొందరు అంటూ ఉన్నారు.మీరు న్యూయార్క్‌కు వెళ్తే ఒకసారి ఆ మ్యూజియంకు వెళ్లి గోల్డెన్‌ టాయిలెట్‌ను చూడండి.ఎంత గోల్డ్‌తో చేసి ఏం లాభం దాన్ని ఎవరు వినియోగించరు కదా అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు