అందుకే కదా నిన్ను అందరు మహానటి అనేది ..!

కీర్తి సురేష్.దసరా సినిమా ప్రమోషన్స్ హడావిడి తో మరోమారు ట్రేండింగ్ లో ఉంది.

వాస్తవానికి ఆమె గురించి మనం మహానటి సినిమా టైం నుంచి అనేక వార్తల్లో చూస్తూనే ఉన్నాం.అప్పటి వరకు ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కనిపించిన మహానటి వంటి జాతీయ స్థాయి నటన తో ఆమె తెలుగు వారికి బాగా దగ్గర అయిపొయింది.

ఇక ఇప్పుడు మరోమారు ఆమె తెలంగాణ మాండలికం లో డైలాగ్స్ చెప్తూ నటిస్తూన్న దసరా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇది కూడా కీర్తి సురేష్( Keerthy Suresh ) కెరీర్ లో ఒక ప్రయోగాత్మక చిత్రంగానే చెప్పుకోవచ్చు.

ఒక నటి ఎలాంటి పాత్ర అయినా కూడా చేసి తీరాలి అని నిరూపించింది కీర్తి సురేష్.

Advertisement

ఇక దసరా( Dasara ) సినిమా మొదటి రోజు షూటింగ్ లో పేడ కలిపే సన్నివేశం ఉండగా యూనిట్ మొత్తం కీర్తి లాంటి ఒక స్టార్ హీరోయిన్ ఇలా పేడ తీయడం జరగదు అని డిసైడ్ అయి ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి చేత నకిలీ పేడ లాంటిది ఒకటి తయారీ చేయించిన కుడా ఆమె నిజమైన పేడ ఎత్తడానికి ఎలాంటి సంశయం చూపించకుండా చాల సహజంగా చేసిందట.అందుకే కదా నిన్ను అందరు మహానటి అంటున్నారు అంటూ ఈ ప్రమోషనల్ ఇంటర్వూస్ చుసిన వారు అంటున్నారు.ఏది ఏమైనా కీర్తి లాంటి ఒక హీరోయిన్ నిజంగానే అద్భుతమైన నటి.కత్తి పట్టి యుద్ధం చేసే సీన్స్ అయినా, పోరాట సన్నివేశాలు అయినా, డి గ్లామర్ రోల్స్ అయినా ఎలాంటి మొహమాటం లేకుండా తన పాత్రకు మాత్రం ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ చేస్తుంది.

ఆమె మహానటి సినిమా తర్వాత సినిమాలు వరసగా పరాజయం పాలవుతుండటం తో ఆమె పని అయిపొయింది అని అంత భావించారు.కానీ మహేష్ బాబు సినిమా అయినా సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) చిత్రం తో సాలిడ్ కామ్ బ్యాక్ ఇచ్చింది.అప్పటి నుంచి ఆమె నటిస్తున్న సినిమాలు వరసగా విజయం సాధిస్తూ ఉన్నాయ్.

ఇక ఇప్పుడు నాని తో దసరా సినిమా తో మరోమారు ప్రేక్షకుల ముందుకు మంచి డి గ్లామర్ మాస్ రోల్ లో రానుంది.ఈ చిత్రం విజయం సాధిస్తే మరి కొన్నేళ్ల పాటు కీర్తి సురేష్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు