విద్యాబాలన్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఆ స్టార్ డైరెక్టర్..?

బాలీవుడ్( Bollywood ) లో ఉన్న అతి కొద్దిమంది టాలెంటెడ్ నటీమణుల్లో విద్యాబాలన్ ( Vidya Balan )ఒకరు ఆమె చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

అనే తెలుగులో కూడా ఎన్టీయార్ బయోపిక్( NTR biopic ) గా వచ్చిన కథానాయకుడు మహానాయకుడు సినిమా లో ఎన్టీయార్ భార్య పాత్ర ని పోషించారు.

ఈ క్యారెక్టర్ లో అనే చాలా అద్బుతం గా నటించారు అనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే సాగుతుంది .ఎవరో ఒకరికి ఎప్పటికప్పుడు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు .టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్ అనేది రచ్చ రేపుతోంది .ఇప్పటికే చాలా మంది నటీమణులు దీనిపై బహిరంగంగా మాట్లాడిన సందర్బాలు కూడా ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం విద్యాబాలన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దక్షిణాది సినిమాల్లో పని చేయడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమెకు ఎదురైన చేదు అనుభవం విద్యాబాలన్ ఇలా వివరించింది.నేను సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి కష్టపడుతున్న రోజుల్లో జరిగింది.

Advertisement

నేను ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ ను కలవడానికి చెన్నై వెళ్లాం.అక్కడ ఓ కాఫీ షాప్ లో దర్శకుడితో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా.

అయితే అతను నన్ను రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అని పదే పదే అడిగాడు.అప్పుడే అతని ఆలోచన ఏమిటనేది నాకు అర్థమైంది.నేను అప్పుడు తెలివిగా గది లాక్ వేయకుండా కొంచెం తెరిచి ఉంచా.

అందుకే ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు అని తెలిపింది.తాను అప్పుడు సమయస్పూర్తిగా ప్రవర్తించడం వల్లే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోగలిగానని చెప్పింది.

అయితే ఆ సినిమా నుంచి తప్పుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పింది.అప్పుడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అవ్వబోతున్నానని అర్థమైందని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అయితే ఆ దర్శకుడు ఎవరు అనేది ఆమె వెల్లడించలేదు.ఇప్పటికీ తాను ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది విద్యా.తర్వాత కూడా ఇలా భయపెట్టే ఘటనలు చాలానే ఎదురైయ్యాయని తెలిపింది.

Advertisement

అంతేకాకుండా ఇలాంటి ఘటనల వలన తాను కొంత కాలం మానసికంగా కూడా డిస్ట్రబ్ అయ్యాయని తెలిపింది.దాని నుంచి బయట పడటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొంది.

ఆ కాఫీ షాప్ ఘటన జరిగిన తర్వాత ఆ దర్శకుడు తనను సినిమా నుంచి తొలగిచడమే కాకుండా తనను బాడీ షేమింగ్ చేశారని వాపోయింది.ఇక ప్రస్తుతం విద్యాబాలన్ తన గ్లామర్ తో వరుస సినిమాలు చేస్తోంది.2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.తర్వాత 2011 లో వచ్చిన డర్టీ పిక్చర్ సినిమాతో ఆమె సినిమా కెరీర్ మలుపు తిరిగింది.

అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది.

తాజా వార్తలు