లోకేష్ కి షాకిచ్చిన నందమూరి ఫ్యాన్స్

ఒకే ఒక్క సంక్రాంతి నందమూరి అభిమానుల మధ్యలో తలనొప్పులు తెచ్చిపెట్టింది.

ఎన్నో దశాబ్దాల నుంచీ కలిసి ఉన్న బాబాయ్ - అబ్బాయ్ ల అభిమానులు విడివిడిగా వేరు అయిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

కేవలం సినిమా విడుదల క్లాష్ అవడం వలెనే ఈ ఇబ్బంది ఒచ్చింది అని చెప్పాలి.అనుకున్న దానికంటే తక్కువగా కొన్ని చోట్లా, ఎక్కువగా కొన్ని చోట్లా అభిమానులు రెండుగా చీలిపోయారు అని చర్చ జరుగుతోంది.

ఎఫెక్ట్ సంగతి అలా వుంచి, నందమూరి అభిమానులు అంతా బాలయ్య వైపే వుంటారని కూడా అనుకున్నారు.అయితే సినిమాలు విడుదలైపోయాయి.

ఓ విషయాన్ని స్పష్టం చేసాయి.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా నందమూరి అభిమానులు చీలిపోలేదు.

Advertisement

ప్రతి చోటా రెండు సినిమాలకు ఫ్లెక్సీలు కలిసే కట్టారు.అన్ని ఫ్లెక్సీల మీదా ఎన్టీఆర్.

బాలయ్య ఇద్దరి ఫొటోలు వున్నాయి.డిక్టటర్ దగ్గరా ఇదే పరిస్థితి.

నాన్నకుప్రేమతో దగ్గరా ఇదే పరిస్థితి.ఎన్టీఆర్ పై ద్వేషం అన్నది కేవలం తెలుగుదేశం పార్టీ పరంగా కాస్త కనిపించిందేమో కానీ, రూట్ లెవెల్లో మాత్రం కాదు.

లోకేష్ కోసమో, వారసత్వం కామెంట్ల వల్లో, తెలుగుదేశంతో అనుబంధం వున్న సామాజికవర్గంలో లోకేష్ పై వున్న అభిమానంతోనో ఎన్టీఆర్ ను దూరం పెట్టాలన్న భావన కనిపించి వుంటే వుండొచ్చు కానీ, నికార్సయిన నందమూరి అభిమానులు మాత్రం ఆ విషయం ఏమాత్రం పట్టించుకోలేదు.శుబ్రంగా రెండు సినిమాలూ చూసి అభిమానం అనే ముసుగులో మూర్ఖ్జత్వం గా ప్రవర్తించేవారికి సమాధానం చెబుతూ వీరు రెండు సినిమాలూ హిట్ చేసారు.

దట్ ఈజ్ నందమూరి ఫాన్స్ అనిపించుకున్నారు.

Advertisement