ఆ గిటార్ రూ.1.32 లక్షలు... స్పెషల్ ఇదే!

గిటార్‌( guitar ) అంటే ఏమిటో తెలియని కుర్రకారు వుండరు.ముఖ్యంగా యూవత గిటార్ అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టాన్ని కలిగి వుంటారు.

అందుకే దీనికి నేర్చుకోవడం కోసం మనోళ్లు చాలా కసరత్తులు చేస్తూ వుంటారు.అలా కొంతమంది గిటార్‌ వాద్యంలో తమ కెరీర్ ని ఎంచుకుంటారు.

అయితే మరికొంతమంది కాలక్షేపంగా గిటార్‌ వాద్యాన్ని సాధన చేస్తూ ఉంటారు.అయితే, ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను మనతోపాటు తీసుకెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని!.

ఎందుకంటే, పొడవాటి గిటార్‌ను బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది.లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది.అంతేకాకుండా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్‌ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు.

Advertisement

ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్‌ సంగీత పరికరాల తయారీ కంపెనీ కియరీ గిటార్స్‌( Keary Guitars )ని మార్కెట్లోకి తీసుకువచ్చాయి.వీటి ప్రత్యేకత ఏమంటే, వీటిని సులువుగా మడిచేసుకునే వీలుంటుంది.

ఈ గిటార్‌ను ఎసెండర్‌ పీ90 సోలో( Ascender P90 Solo ) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్‌ చేసుకోవచ్చు.అంతేకాదండోయ్.

ఇది సాధారణ గిటార్స్ కంటే చాలా వినూత్నంగా కనబడుతుంది.డిజైన్, స్టైలిష్ లుక్ దీని సొంతం.

మరి దీని ధరను చూసి మూర్ఛపోవద్దు మరి.కొన్ని సౌకర్యాలు కావాలంటే కాసులు కూడా పెట్టాల్సి ఉంటుంది.కాగా, కంపెనీ దానిని 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు)గా నిర్ణయించింది.దానిని కావాలనుకున్న ఔత్సాహికులు ఆన్లైన్ సైట్లో ట్రై చేయగలరు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు