కేసీఆర్ కు ధన్యవాదాలు... ప్రకాశ్ అంబేద్కర్ కామెంట్స్

రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు.అణగారిన వర్గాల అభివృద్ధి కోసం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని అంబేద్కర్ సూచించారన్న ఆయన చదువుకున్నాక సంఘటితం కావాలని చెప్పారన్నారు.తరువాత సంఘర్షణ చేయాలని అంబేద్కర్ తమకు నేర్పించారన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్న కేసీఆర్ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement