ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించినందుకు సాయిపల్లవికి సన్మానం.. ఈ హీరోయిన్ గ్రేట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది సాయి పల్లవి.

అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో( Thandel ) నటిస్తున్న విషయం తెలిసిందే.చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్( Allu Aravind ) నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ సాయి పల్లవిని ఈ తండేల్ టీమ్ ఘనంగా సత్కరించింది.సాయి పల్లవి తో కేక్ కట్ చేపించి మరీ తినిపించారు.

ఆ తర్వాత అందరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఆ ఫోటోలలో అందరు ఆరు సింబల్స్ చూపించారు.అయితే ఆ ఆరు సింబల్స్ మరేంటో కాదండోయ్ సాయి పల్లవి ఇప్పటివరకు గెలుచుకున్న ఆరు ఫిలింఫేర్ అవార్డులు.

Advertisement

( Six Filmfare Awards ) ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు తండేల్ మూవీ మేకర్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సాయి పల్లవి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా హీరోయిన్ సాయి పల్లవి మొదట ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాకు గాను బెస్ట్ ఫిమేల్ గా డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.అలాగే ఫిదా, లవ్‌ స్టోరీ చిత్రాలకు కూడా ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది.ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి మరోసారి సత్తా చాటింది.

గార్గి, విరాటపర్వం చిత్రాలకు గాను మరో రెండు అవార్డులను అందుకుంది.వీటితో కలిపి సాయి పల్లవి ఇప్పటివరకు ఆరు పురస్కారాలు అందుకుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా ఈ బ్యూటీ చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్‌ కటింగ్‌ తో సెలబ్రేట్‌ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు