త్రివిక్రమ్ పై కామెంట్స్ చేసిన థమన్.. నా కెరీర్ ఇలా ఉండడానికి కారణం..

టాలీవుడ్ లో ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఎస్ ఎస్ థమన్.

ఈయన గతంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని జయించి ఇప్పుడు టాప్ లో నిలిచాడు.

థమన్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అనే చెప్పాలి.ఇక ఒక్కో సినిమాకు ఈయన అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు.

అల వైకుంఠపురంలో మొదలుకుని ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయనే చెప్పాలి.అల వైకుంఠపురంలో సినిమాకు ఏకంగా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు.

ప్రెజెంట్ థమన్ చేతిలో చాలా బడా ప్రాజెక్టులు ఉన్నాయి.ఇవన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అవుతూనే ఉంటాయి.

Advertisement

ఈ ఏడాదిలో అప్పుడే థమన్ నుండి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటు కోలీవుడ్ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమాలకు ఈయన మ్యూజిక్ అందించగా రెండు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.ఇక ఇదిలా ఉండగా ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని త్రివిక్రమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

తన లైఫ్ త్రివిక్రమ్ గారితో పరిచయానికి ముందు ఆ తర్వాత అనే చెప్పుకోవాలని అన్నారు.తన లైఫ్ లో తివిక్రమ్ బెస్ట్ పెర్సన్ అని ఆయనతో పని చేసిన అరవింద సమేత మూవీని ఎప్పటికి మర్చిపోలేనని.ఈ సినిమా కోసం ప్రాణం పెట్టానని.

ఇక ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ అవుట్ ఫుట్ అంత అద్భుతంగా రావడానికి కారణం కూడా త్రివిక్రమ్ గారే అని చెప్పుకొచ్చారు.ఇక ప్రెజెంట్ త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ సినిమా సాంగ్ పై కూడా ద్రుష్టి పెట్టానని ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసాడు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు