దళపతి విజయ్ 'వారసుడు' ఫస్ట్ లుక్ అదుర్స్..!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సినిమాలో విజయ్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాకు టైటిల్ గా వారసుడు అని ఫిక్స్ చేశారు.

తమిళంలో కూడా వారిసు అని ఫిక్స్ చేశారు.ఆల్రెడీ ఇదివరకే ఈ సినిమాకు టైటిల్ గా వారసుడు అని డిస్కషన్ లో ఉందని లీక్ అయ్యింది.

అనుకున్నట్టుగానే విజయ్ 66వ సినిమా టైటిల్ గా వారసుడు అని పెట్టారు.వారసుడు ది బాస్ రిటర్న్స్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు.

Advertisement

టైటిల్ పోస్టర్ లో విజయ్ క్లాస్ లుక్ అదిరిపోయింది.తమిళంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ తో క్లాస్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు డైరక్టర్ వంశీ పైడిపల్లి.

మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ సినిమా కథ విజయ్ కు బాగా నచ్చిందని.అందుకే ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు స్ట్రైట్ గా రావాలని ఫిక్స్ అయ్యారు విజయ్.

జూన్ 22 బుధవారం విజయ్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే వంశీ పైడిపల్లి సినిమా ఫస్ట్ లుక్ తో దళపతి ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు