రాజకీయాల్లోకి విజయ్ దళపతి.. తమిళనాట మళ్ళీ హాట్ టాపిక్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.

ఈయన సినిమా వస్తుందంటే చాలు అక్కడ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా 200 కోట్లు ఈజీగా రాబట్టగలిగే సత్తా ఈయనకు ఉంది.

మరి అలాంటి బలమైన హీరో రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది.అందుకే ఈయన రాజకీయ ఎంట్రీపై అక్కడ ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే ఈయన రాజకీయ రంగప్రవేశంపై ఎన్నో సార్లు వార్తలు వైరల్ అయ్యాయి.ఒకానొక సమయంలో ఈయన పార్టీ పెట్టబోతున్నాడు అని కూడా రూమర్స్ రాగా ఈయన ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ ఉండేవాడు.

Advertisement

మరి తాజాగా విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై( Vijay political entry ) తమిళనాట ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.ఇది అక్కడ ఎవర్ గ్రీన్ టాపిక్ అనే చెప్పాలి.ఈయన రాజకీయాల గురించి మాట్లాడితే పెద్ద సంచనలనమే.

అదే సంచలనం నిన్న జరిగింది.ఈయన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులలో అత్యధిక మార్కులు సంపాదించిన వారిని చెన్నై( Chennai )లో సన్మానించారు.

ఈ సందర్భంగా రాజకీయాల గురించి కూడా స్పీచ్ ఇచ్చారు.నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు అని.విద్యార్థులంతా ఇంటికి వెళ్ళాక డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని పేరెంట్స్ కు చెప్పాలని.ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా డబ్బుమయం అయిపోయిందని.

డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతీ మార్చాలని కోరాడు.ఏ నేతలు బాగా పని చేస్తున్నారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఎవరు డబ్బులు తీసుకుంటున్నారో గమనించాలని.డబ్బు తీసుకుని ఓటు వేస్తె మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందని ఆయన తెలిపాడు.

Advertisement

మరి విజయ్ రాజకీయాల గురించి ఉన్నట్టుండి మాట్లాడడంతో తమిళనాట ఈయన రాజకీయాల్లోని ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని దానికోసమే ఇప్పటినుండి వేదిక సిద్ధం చేసుకుంటున్నాడు అని అంటున్నారు.

తాజా వార్తలు