కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.
ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.
ఇటీవలే బీస్ట్ సినిమాతో వచ్చాడు విజయ్.ఈ సినిమా ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇక ఇది ఇలా ఉండగా.తాజాగా అందుతున్న సమాచారం మేరకు విజయ్ దళపతి తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు టాక్.
విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కూడా నటుడుగా అవ్వాలని కోరుకుంటున్నాడు.అందుకే విజయ్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదట.
సూపర్ స్టార్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఈయన ఎంట్రీ కోసం కథలు వింటున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.
తన కొత్త సినిమాలో గెస్ట్ రోల్ ను కూడా డిజైన్ చేయిస్తున్నాడట.ఇలా మొత్తానికి కొడుకు కోసం సోలో కథలు వింటూనే ఆయన సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గర చేయాలని అనుకుంటున్నాడు.ఇది పక్కన పెడితే ఈయన సినిమాల విషయానికి వస్తే.
ప్రెసెంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
ఆ తర్వాత విజయ్ దళపతి తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ తో చేయనున్నాడు.ఇటీవలే లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
దీంతో ఈ సినిమాపై ముందే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy