వారసుడు (తమిళ వెర్షన్) రివ్యూ ఇదే.. సినిమాకు మైనస్ పాయింట్లు ఏంటంటే?

సంక్రాంతి పండుగ కానుకగా వారసుడు తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల కాకపోయినా తమిళ వెర్షన్ వారిసు విడుదలైంది.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడం గమనార్హం.

విజయ్ ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నారు.అయితే తమిళనాడులో ఈరోజు విడుదలైన వారసుడు మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన రాజేంద్రన్ (శరత్ కుమార్) తన తర్వాత తన వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలను ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగించాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాడు.ఆ స్థానంపై ఇద్దరు కొడుకులకు ఆశ ఉండగా చివరి కొడుకైన విజయ్ కు మాత్రం ఆశ ఉండదు.

తండ్రి విధానాలు నచ్చక విజయ్ తనకు నచ్చిన విధంగా జీవనం సాగించడానికి ఇష్టపడుతూ ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉంటాడు.

Advertisement

అయితే రాజేంద్రన్ కు జై ప్రకాష్(ప్రకాష్ రాజ్) అనే వ్యక్తి నుంచి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.అయితే తిరిగి ఇంటికొచ్చిన విజయ్ జై ప్రకాష్ కు ఎలా చెక్ పెట్టాడు? స్వార్థంగా ఆలోచించే తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు? నిజమైన వారసుడు అని ఎలా అనిపించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.సంక్రాంతి పండుగకు ఫ్యామిలీ మూవీ చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

సాంగ్స్, విజయ్ నటన, కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్పవచ్చు.కథ, కథనం రొటీన్ గా ఉండటం, ఇప్పటికే చూసిన పలు తెలుగు సినిమాలను ఈ సినిమా గుర్తు చేయడం, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా వారసుడు మూవీ హిట్ అనిపించుకునేది.

Advertisement

తాజా వార్తలు