కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) వారిసు సినిమాతో ఫ్యాన్స్ ను అలరించిన ఈయన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఆ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లియో.
( Leo Movie ) భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా లియో.
లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెరిగాయి.
ఈ ప్రాజెక్ట్ లో వివిధ బాషలలో స్టార్స్ భాగం అయ్యారు.అందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు.ఈయన కీ రోల్ లో నటిస్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నుండి త్వరలోనే బర్త్ డే బ్లాస్ట్ సిద్ధం అవుతుంది అని టాక్.జూన్ 22న విజయ్ పుట్టిన రోజు ఉంది అనే విషయం తెలిసిందే.
మరి ఈ బర్త్ డే రోజు లోకేష్ అదిరిపోయే బ్లాస్ట్ సిద్ధం చేస్తున్నాడట.
కోలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా నుండి పోస్టర్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ గ్లింప్స్ సుమారు నిముషం నిడివి ఉండేలా కట్ చేసారని టాక్.చూడాలి ఈ సినిమా గ్లింప్స్ ఏ రేంజ్ లో ఆకట్టు కుంటుందో.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy