పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్( Pahalgam ) ప్రాంతం మంగళవారం జరిగిన భయానక ఉగ్రదాడితో( Terror Attack ) ఒక్కసారిగా హృదయవిదారక ఘటనకు వేదికైంది.

ప్రకృతి అందాల మధ్య విశ్రాంతికోసం వెళ్లిన పర్యాటకులపై( Tourists ) ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి చేసేలా దాడి చేశారు.

ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించగా, 16 మంది గాయపడినట్లు సమాచారం.ఈ దాడిలో ఉగ్రవాదులు కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

మహిళలు ఉన్నప్పటికీ వారిపై కాల్పులు జరపలేదు.దాడి జరిగిన సమయంలో చాలామంది పర్యాటకులు కుటుంబాలతో కలిసి పహల్గామ్‌ను సందర్శిస్తున్నారు.

తీవ్రవాదులు బస్సును అడ్డగించి, ఐడీ కార్డులు చెక్ చేసి పురుషులపై కాల్పులు జరిపారు.ఇది కేవలం యాదృచ్ఛికం కాకుండా, స్పష్టంగా ప్లాన్ విధంగా జరిగింది.

Advertisement

ఈ దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం వాసి రిటైర్డ్ ఉద్యోగి చంద్ర మౌళి,( Chandramouli ) నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్,( Madhusudan ) హైదరాబాద్‌ లోని స్టేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మనీష్ రంజన్( Manish Ranjan ) కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు.అలాగే బీహార్‌కు చెందిన మనీష్ రంజన్ కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు.

ఆయన కుటుంబంతో కలిసి పర్యటనకు వచ్చిన సమయంలో భార్య, ఇద్దరు పిల్లల ఎదుటే ఉగ్రవాదులు ఆయనను గుర్తించి కాల్చిచంపినట్లు సమాచారం.ఆయన ఐడీ కార్డు చూసి ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఈ దాడిలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు పర్యాటకులు మరణించారు.వీరిలో ముంబై నివాసితులు హేమంత్ సుహాస్ జోషి, సంజయ్ లక్ష్మణ్ లాలీ, అతుల్ శ్రీకాంత్ మోని, సంతోష్ జగ్దా, కస్తూబా గాంవోటే ఉన్నారు.అలాగే ఇండోర్‌కు చెందిన సుశీల్ నథానియల్, తన భార్య పుట్టినరోజు సందర్భంగా కాశ్మీర్ వెళ్లిన సమయంలో ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన LIC బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.ఈ దాడిలో గుజరాత్‌కు చెందిన యతేష్ పర్మార్, అతని కుమారుడు సుమిత్ పర్మార్ మరణించారు.వీరితో పాటు సూరత్‌కు చెందిన శైలేష్‌భాయ్ హిమ్మత్‌భాయ్ కలాథియా కూడా హత్యకు గురయ్యారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

అలాగే ఈ దాడిలో పహల్గామ్‌కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, నేపాల్‌కు చెందిన సుదీప్ న్యూపానే, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఒడిశా, కేరళ, చండీగఢ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్‌లకు చెందిన పర్యాటకులు కూడా ఉగ్రవాదుల బుల్లెట్లకు బలయ్యారు.దేశమంతా ఈ దాడిపై తీవ్రంగా స్పందిస్తోంది.

Advertisement

పర్యాటక ప్రదేశంలో నిర్భయంగా పర్యటిస్తున్న నిస్పృహులైన ప్రజలపై ఉగ్రదాడి చేయడం అంతుచిక్కని అమానుష చర్యగా భావిస్తున్నారు.ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, దేశ భద్రతపై నిలిచిన ప్రశ్నగా మారింది.

ఈ ఘటన మళ్లీ కాశ్మీర్ లో సెక్యూరిటీ పై సందేహాలు తెరలేపింది.కేంద్రం నుండి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో తరలించి కశ్మీర్ లో గస్తీ ముమ్మరం చేయడం ప్రారంభమైంది.

నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు