ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మినీ బస్సు ట్రక్కు.ట్యాంకర్ డీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో మురాదాబాద్ ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది.

వెంటనే ఈ సంగతి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతులకు రెండు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.

అదేవిధంగా మిగతా బాధితులకు యాభై వేలు చొప్పున సహాయాన్ని అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఎలా ఉంటే సంఘటన జరిగిన వెంటనే స్థానికులు అదేవిధంగా జాతీయ రహదారిపై మిగతా వాహనాలు వాళ్ళు క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet