కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత

కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ స్వల్ప తేడాతో ఓడిపోయారు.

కేవలం 326 ఓట్ల తేడాతో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు.దీంతో బీజేపీ శ్రేణులు కౌంటింగ్ సెంటర్ వద్దకు భారీగా చేరుకున్నారు.

బీజేపీ శ్రేణులతో పాటు బండి సంజయ్ అనుచరులు రీ కౌంటింగ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు గంగులకు మద్ధతుగా బీఆర్ఎస్ నేతలు కూడా వస్తున్నారు.

అయితే 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో నేతలు ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని చెబుతున్నారు.ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు