శ్రీశైలం దేవస్థానంలో ఉద్రిక్తత..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో ఉద్రిక్తత నెలకొంది.స్వామివారి ఆర్జిత సేవ క్యూలైన్‎లో భక్తుడు, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వివాదం చెలరేగింది.

రూ.500 టికెట్ తో ఆర్జిత సేవ క్యూలైన్‎లోకి వెళ్తానని నవీన్ అనే భక్తుడు గొడవకు దిగినట్లు సమాచారం.ఇందుకు అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ సెక్యూరిటీ గార్డ్ పై చేయిచేసుకున్నాడు.

నవీన్ ను గార్డ్ తిరిగి కొట్టడంతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.ఆలయ సిబ్బంది, ఇతర భక్తులు వారిని అడ్డుకుని వారించడంతో కాసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

దీంతో తోటి భక్తులు భయాందోళనకు గురయ్యారు.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు