నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

పీడీఎస్‎యూ, ఎన్ఐఎస్‎యూ విద్యార్థి సంఘాల నేతలు అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు.వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారని తెలుస్తోంది.అయితే వర్సిటీలో గత కొన్ని రోజులగా రిజిస్ట్రార్ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రిజిస్ట్రార్ నేనంటే నేనంటూ ప్రొఫెసర్ యాదగిరి, కనకయ్యల మధ్య రగడ చెలరేగింది.అయితే ప్రొ.

Advertisement

యాదగిరిని రిజిస్ట్రార్ గా, కనకయ్యను వీసీగా పాలకమండలి నియమించింది.దీంతో వర్సిటీ రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం కొనసాగుతుంది.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు