హైదరాబాద్ రాజ్‎భవన్ ముట్టడిలో ఉద్రిక్తత

హైదరాబాద్ రాజ్‎భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరును నిరసిస్తూ ఛలో రాజ్‎భవన్ కు సీపీఐ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ తో పాటు రాజ్‎భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.ఛలో రాజ్‎భవన్ లో పాల్గొనేందుకు సీపీఐ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

రాజ్‎భవన్ వద్ద నిరసనకు దిగిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలిస్తున్నారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement