బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉద్రిక్త‌త‌

జ‌న‌గామ జిల్లాలో బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను టీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయ‌డంతో బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు.ఈ క్రమంలో ఇరుపార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడుల‌కు దిగారు.

ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తతోపాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దాడి ఘటనపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత జ‌రుగుతున్న పోలీసులు చూస్తూ ఉండిపోయార‌ని ఆయ‌న ఆరోపించారు.అనంతరం డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement

టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నేతల తలలు పగులగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.ఉన్న‌తాధికారులు స్పందించి దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు