సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీ నేత దేశ్ పాండే రాజేశ్వర రావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

వెంటనే గమనించిన కార్యకర్తలు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు వ్యవహారంలో అనూహ్యా పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఉదయం దేశ్ పాండే రాజేశ్వరరావు పేరును ప్రకటించిన బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింది.ఈ క్రమంలోనే పులి మామిడిరాజుకు పార్టీ అధిష్టానం బీ -ఫామ్ ఇచ్చింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దేశ్ పాండే రిటర్నింగ్ కార్యాలయం వద్ద బలవన్మరణానికి యత్నించారు.రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

బీ-ఫామ్ పంపిస్తున్నట్లు చెప్పి వేరే వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.కిషన్ రెడ్డి తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ వాపోయారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement