హైదరాబాద్ గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రోడ్డుకు రెండు వైపులా పుట్ పాత్ పై ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.

సుమారు యాభైకి పైగా గుడిసెలను అధికారులు కూల్చివేశారు.నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో జీహెచ్ఎంసీ కూల్చివేత చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు