US Nashville : ఇదేందయ్యా ఇది.. చోరీకి వచ్చి ఇంట్లో స్నానం చేసిన దొంగ…

సాధారణంగా యజమాని అనుమతి లేకుండా ఇంట్లోకి రహస్యంగా చొరబడితే వారిని దొంగలు( Thieves ) అంటారు.

ఈ దొంగలు అందిన కాడికి విలువైన వస్తువులు దోచేసి అక్కడ నుంచి పరారవుతుంటారు.

అయితే యూఎస్ దేశం, నాష్‌విల్లే( Nashville )లోని ఒక ఇంట్లో పడ్డ దొంగ ఏం దొంగలించలేదు.బహుశా అతడిని దొంగ అనకూడదేమో.

కానీ అతడు ఆ ఇంట్లో ఉన్న ఒక షవర్ లోకి వెళ్లి స్నానం చేశాడు.వినడానికి వింతగా ఉన్నా రీసెంట్‌గా ఇదే జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల కెరిగన్ నార్డి( Kerigan Nardi ), ఆమె భర్త కలిసి డేట్ నైట్ కోసం బయటికి వెళ్లారు.వారు డేట్ నైట్ ఎంజాయ్ చేస్తూండగా సడన్‌గా హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌ నుంచి భయానక హెచ్చరిక వచ్చింది.

Advertisement

ఆగ్నేయ నాష్‌విల్లేలోని వారి ఇంట్లో ఎవరో ప్రవేశించారని ఆ అలర్ట్( Thief Alert ) తెలిపింది.ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నందున అది తప్పుడు అలారం అయి ఉంటుందని దంపతులు భావించారు.అయితే వారి ఫోన్‌లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించగా.

ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడడం చూశారు.అతను వారి వస్తువులను చూస్తున్నాడు, ఆపై స్నానం చేయడానికి వెళ్ళాడు.

వారు వెంటనే 911కి కాల్ చేసి కుక్కల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.పోలీసులు త్వరత్వరగా వచ్చి సోఫాలో కూర్చున్న వ్యక్తిని కనుగొన్నారు.

అతను టవల్ మాత్రమే ధరించాడు.అతని పేరు శామ్యూల్ స్మిత్.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అతనితో మెథాంఫెటమైన్ ఉంది.పోలీసులు అతనిని అరెస్టు చేసి, అక్రమంగా ప్రవేశించాడని, డ్రగ్స్ కలిగి ఉన్నాడని అభియోగాలు మోపారు.

Advertisement

"అతను నగ్నంగా ఉన్నాడు, మా సోఫాలో కూర్చున్నాడు," అని కెరిగన్ లోకల్ మీడియా( Local Media )తో చెప్పింది.ఎంత డ్రగ్స్ మత్తులో ఉంటే మాత్రం ఇలా ఇళ్లల్లోకి వచ్చేస్తారా, ఇది చాలా దారుణం అని ఆమె ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.జరిగిన సంఘటనతో ఉలిక్కిపడ్డామని ఆ దంపతులు చెప్పుకొచ్చారు.

వారు తమ ఇంటిని బాగా శుభ్రం చేశారు.ఆ వ్యక్తి ఉపయోగించిన టవల్‌ను విసిరేసి, షవర్‌ను బ్లీచ్ చేశారు.

ఈ జంట మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తలుపుకు డెడ్‌బోల్ట్ లాక్, బారికేడ్‌ను ఉంచారు.ఇంటిలో మరిన్ని కెమెరాలు ఇన్‌స్టాల్ చేస్తామని కూడా చెప్పారు.

ఇరుగుపొరుగు వారికి కూడా అలాగే చేయమని సలహా ఇచ్చారు.

తాజా వార్తలు