కేవలం 12 గంటలలో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన టెంపర్ తమిళ రీమేక్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

విలనీ షేడ్స్ తో సాగే హీరోయిజంతో ఎన్టీఆర్ ఆ సినిమా రేంజ్ కి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే టెంపర్సినిమాలో హిందీలో రణవీర్ సింగ్ హీరోగా సింబ టైటిల్ తో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో రెండు వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.ఇదిలా వుంటే ఈ సినిమాని స్టార్ హీరో విశాల్ తమిళంలో రీమేక్ చేసాడు.

అయోగ్య టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ఇప్పటికే తమిళనాట భారీ అంచనాలు వున్నాయి.తాజాగా ఈ సినిమా తీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

టీజర్ రిలీజ్ అయిన 12 గంటలలోనే ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో వన్ మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది.విశాల్ కెరియర్ లో ఈ స్థాయిలో తక్కువ టైంలో ఈ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్న టీజర్ అయోగ్య కావడం విశేషం ఠాగూర్ మధు నిర్మిస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్య సినిమా వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకేక్కుతూ వుండగా ఇందులో విశాల్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రాశిఖన్నా నటిస్తుంది.మొత్తానికి ఈ వ్యూస్ తో తమిళనాడులో కూడా అయోగ్య సినిమా కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 15, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు