రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో తెలుగు స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు.

మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం చిరుత సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన స్టార్ హీరోలు లేరు అనెంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

మరి తను ఎంచుకున్న సినిమాలు ఆయనను చాలా గొప్ప స్థానంలో నిలపడమే కాకుండా స్టార్ హీరోల రేంజ్ ని కూడా పరిచయం చేసేలా చేశాయి.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

దాంతో పాటుగా బుచ్చిబాబు( Buchi Babu Sana ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యాడు.ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న వార్తలు వస్తున్నాయి.ఇక దీని కోసం రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున ( Nagarjuna )కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే కుబేర, కూలీ లాంటి రెండు పెద్ద సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్న నాగార్జున ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు అనే వార్తలైతే ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఇక మొత్తానికైతే ఈ వార్త కనక నిజమైతే ఈ సినిమా మీద బజ్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుందనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ బుచ్చిబాబు ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు