నా పై చేసిన కామెంట్స్ చూసి ఏడుపు వచ్చేది.. కానీ..

తెలుగులో స్వాతి చినుకులు, కుంకుమ పువ్వు, ప్రేమ ఎంత మధురం, తదితర ధారావాహికలలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి అనూ శ్రీ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే తాజాగా నటి అనూ శ్రీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సీరియల్ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను స్వాతి చినుకులు అనే ధారావాహికలో నటిస్తున్న సమయంలో ఆ ధారావాహికకి కో డైరెక్టర్ గా పని చేసినటువంటి ఓ దర్శకుడి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది.అయితే మొదటగా తన భర్తకి తానే ప్రపోజ్ చేశానని ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.

ఇక సీరియళ్లలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో నటించినందువల్ల కొందరు తనని తప్పుగా అపార్థం చేసుకున్నారని అంతటితో ఆగకుండా అప్పుడప్పుడు తన గురించి సోషల్ మీడియా మాధ్యమాలను నెగిటివ్ గా కామెంట్లు చేయడం మరియు అసభ్యకరంగా మాట్లాడడం వంటివి చేశారని అలాంటి వాటిని చూసినప్పుడల్లా తనకు ఎంతగానో బాధగా ఉండేదని తెలిపింది.కానీ ఒకానొక సమయం తర్వాత తన పాత్రలని ప్రేక్షకులు అంతగా అర్థం చేసుకున్నారని అందువల్లనే ఇలాంటివి జరుగుతున్నట్లు గ్రహించి ప్రస్తుతం పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

Telugu Serial Actress Anu Sree About Negative Comments, Telugu Serial Actress, A

అలాగే ప్రస్తుతం తమ భార్యా భర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా హ్యాపీగా పెళ్లి జీవితాన్ని అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చింది.అయితే ప్రస్తుతం తాను జీ తెలుగు లో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం ధారావాహికలో నటిస్తున్నట్లు కూడా తెలిపింది.అలాగే తన భర్త తెలుగు, తమిళం, ధారావాహికలకు కో డైరెక్టర్ గా పని చేస్తున్నాడని, దీంతో ప్రస్తుతం లైఫ్   చాలా హ్యాపీగా సాగిపోతుందని కూడా తెలిపింది.

Advertisement
Telugu Serial Actress Anu Sree About Negative Comments, Telugu Serial Actress, A
Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

తాజా వార్తలు