అవును, మీరు విన్నది నిజమే.దాదాపు ఓ దశాబ్దకాలం నుండి టాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ అబ్బా అంటోంది.
మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళ విజయాలు అక్కడి సో కాల్డ్ మాఫియాకు మింగుడు పడడం లేదు.మొత్తగా భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమే అన్న రీతిగా మారింది.
దీని కారణం వెనుక తెలుగు దర్శకుల పరిశ్రమ ఎంతోఉంది.ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్( Bollywood ) సినిమానే అన్న నానుడి ఉండేది.
అంత బలంగా పాతుకుపోయిన ఓ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉండేవి.అక్కడ ఓ వర్గంవారు మాత్రమే ఆధిపత్యం చెలాయించేవారు.
మా వాళ్ళు మాత్రమే ఎదగాలి, మా వాళ్ళు తీసినవి మాత్రమే సినిమాలు, వీరు మాత్రమే స్టార్స్ అంటూ కుంచిత మనస్తత్వంతో కుళ్ళిపోయి, కంపు కొడుతున్న బాలీవుడ్ మాఫియా గర్వాన్ని అణచివేసింది ఎవరో తెలుసా? మన తెలుగోళ్లు.అవును, అలా చెప్పుకోవడానికి నేడు మనకి ఎంతో గర్వంగా ఉంటుంది.
నిన్నమొన్నటి వరకు తెలుగు సినిమా అంటేనే వారికి చిన్న చూపు.అలాంటిది ప్రపంచ సినిమా యవనికపై తెలుగోడి సినిమా నేడు చెరిగిపోని ముద్ర వేసుకోవడంతో వారికి మింగుడు పడడంలేదు.అవును, ఇప్పుడు ఓ తెలుగు బిడ్డ బాలీవుడ్ మాఫియా బట్టలు విప్పి నగ్నంగా నడి వీధిలో కూర్చో బెడితే, మరో తెలుగోడు ఆ బాలీవుడ్ మాఫియా గర్వాన్ని అణిచేలా నార్త్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాడు.
అదంతా ఒకెత్తయితే ఇపుడు నేనున్నానంటూ ఒకడు అమాంతం పైకి లేచి బాలీవుడ్ మాఫియా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.వారే దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు నాగ్ అశ్విన్.
సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga )కి బాలీవుడ్ మాఫియాకి మధ్య అప్పుడప్పుడూ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది.సందీప్ సినిమాలు అక్కడ రిలీజైతే చాలు.కొంతమంది రాళ్లు విసరడానికి రెడీగా ఉంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ మాఫియా రివ్యూవర్స్ ఒకే ఒక్క స్టార్ ఇచ్చిన “కబీర్ సింగ్” అక్కడ కలెక్షన్స్ సునామి సృష్టించింది.అదేవిధంగా వారంతా పెదవి విరిచిన “యానిమల్( Animal ) బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
ఈ క్రమంలో సందీప్ చెప్తున్న నిజాలు వింటుంటే ఇందుకు కదా సుశాంత్ ఆత్మహత్య చేసుకుంది, ఇందుకు కదా కంగనా కన్నీరు పెట్టుకుంది అని అనిపించక మానదు.ఇక జక్కన్న రాజమౌళి గురించి చెప్పేదేముంది? బాహుబలితో( Baahubali 2 ) బాలీవుడ్ మాఫియా బలి అయిపోయింది అని చెప్పుకోవచ్చు.ఈ క్రమంలో అక్కడ కూడా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మీద వారు ఒకింత రగిలిపోతున్నారుఅందుకే వీరు అక్కడ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసారో చెప్పుకోవచ్చు.
ఇపుడు ఇక వీరు చాలరన్నట్టు మరొకడు బరిలో దిగాడు.అతడే నాగ్ అశ్విన్.
అవును, నేడు కల్కి రూపంలో నాగ్ అశ్విన్ వేసిన బ్రహ్మాస్త్రానికి బాలీవుడ్ మాఫియా వెన్నుపూస అమాంతం కదిలిపోయిందని చెప్పుకోవచ్చు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy