తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.08

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.9.55 ల11.44

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు విలువైన వస్తులాభాలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు.వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.

కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మిథునం:

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి.

కర్కాటకం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

సింహం:

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.గృహమున కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అదిగమిస్తారు.

కన్య:

ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.

తుల:

ఈరోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి.దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

ఉద్యోగాలలో పనిఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు.

వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ధనుస్సు:

ఈరోజు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.

మకరం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి.

బంధు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.

కుంభం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు.కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

మీనం:

ఈరోజు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి.ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తాజా వార్తలు