తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే10, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.47

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.40

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.7.05 ల7.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల912 మ12.28 ల1.12

మేషం:

ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి.

తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మిథునం:

ఈరోజు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది.

విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.

మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

సింహం:

ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

కన్య:

ఈరోజు ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది.ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు.

ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల:

ఈరోజు పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది.

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు.

వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

మకరం:

ఈరోజు మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి.ఆలోచనలో ఆచరణలో పెడతారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభం:

ఈరోజు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది.వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు.

తాజా వార్తలు