తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి25, మంగళవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.17

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.29

రాహుకాలం: మ.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా7.28 ల7.52

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 25 Thursday 2025, Ma

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 25 Thursday 2025, Ma

ఈరోజు బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ఇండియా లైఫ్‌స్టైల్ బెస్ట్ అంటున్న కెనడా ఎన్నారై.. కారణం తెలిస్తే అవాక్కవుతారు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి29, శనివారం 2025

వృషభం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 25 Thursday 2025, Ma
Advertisement

ఈరోజు మీరు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథునం:

ఈరోజు ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.

సింహం:

: ఈరోజు మీకు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ ఉండదు.

వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

తుల:

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు.వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు.

దూర ప్రయాణాలు కలసివస్తాయి.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.సంతాన శుభకార్య విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి.పాత ఋణాలు తీర్చగలుగుతారు.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది.

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వలన శ్రమ అధికమౌతుంది.

మకరం:

ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందవు.

వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.

మీనం:

ఈరోజు సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో సంతృప్తినిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి.దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారమున ఉన్న సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.

తాజా వార్తలు