తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.10.47 ల11.23 సా5.47 ల6.35

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 21 Friday 2025, Marc

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 21 Friday 2025, Marc

ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి26, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి26, బుధవారం 2025

వృషభం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 21 Friday 2025, Marc
Advertisement

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

మిథునం:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

సింహం:

ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.

భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.

కన్య:

ఈరోజు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.

తుల:

ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.

దైవ చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు.

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది.ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి.

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఇంటాబయట నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.

కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.

మకరం:

ఈరోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కుంభం:

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మీనం:

ఈరోజు సుఖ శాంతిని పొందుతారు.ఆర్థికంగా ఈ రోజు నూతన అవకాశాలు కనిపించవచ్చు.వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనవసర ఖర్చులను తగ్గించుకోండి.

తాజా వార్తలు