తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్13, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.38

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.44

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.6.33 ల7.33

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ.12.28 ల1.12

మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.బంధుమిత్రుల కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు.మీరు చేపట్టిన పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!
డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా... పోలీసుల తీరుపై మండిపడిన బన్నీ!

వృషభం:

Advertisement

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మిథునం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి ధనం చేతిలో నిల్వఉండదు.

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి.

ఆధ్యాత్మికచింతన కలుగుతుంది.ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

కర్కాటకం:

ఈరోజు ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.పనులలో శ్రమపెరుగుతుంది.ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

సింహం:

ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.కుటుంబ సమస్యలు పరిష్కరించుచకుంటారు.కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇంటాబయటా నీ మాటకు విలువ పెరుగుతుంది.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది.

ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు.

తుల:

ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు.సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం:

ఈరోజు ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.

ధనుస్సు:

ఈరోజు నూతన వ్యాపారాలు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.రుణదాతల నుండి ఒత్తిడి తొలగుతుంది.

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు.

మకరం:

ఈరోజు భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.

కుంభం:

ఈరోజు ఉద్యోగాలలో తనకు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.సంతానం, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి.

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అరోధాలను అధిగమిస్తారు.వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

తాజా వార్తలు