తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్5, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.8.30 ల9.22

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 05 Thursday 2024

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 05 Thursday 2024

ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.

Advertisement

వృషభం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి.

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి.

చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు.వృత్తి వ్యాపారాలలో సమస్యలు తప్పవు.

మిథునం:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.దైవ చింతన పెరుగుతుంది.

దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

సింహం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

నూతన రుణయత్నాలు చేస్తారు.వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి.

బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

కన్య:

ఈరోజు బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.

తుల:

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి.ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

వృశ్చికం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది.అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు.బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

మకరం:

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభం:

ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు