తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు12, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.15

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.9.36 ల9.50

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

వీడియో: దత్తత తీసుకోమని దీనంగా అడిగిన పిల్లి.. తర్వాతేమైందో చూస్తే..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు11, ఆదివారం 2024

ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి.

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

మిథునం:

ఈరోజు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.

ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు.కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

సింహం:

ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య:

ఈరోజు ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి.

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.

దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ధనుస్సు:

ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మకరం:

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృత్తి వ్యాపారాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు.ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేముందు కాస్త ఆలోచించండి.

దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొత్త పరిచయాలు పెరుగుతాయి.

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు