తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 15, గురు వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: భరణి మంచి రోజు కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బునుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.

వృషభం:

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

Advertisement

మిథునం:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

తరచు మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

సింహం:

ఈరోజు మీరు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు.బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచన అవసరం.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్టా చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

మీనం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలను అందుకుంటారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

తాజా వార్తలు