తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 02, బుధవారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

వృషభం:

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

Advertisement

మిథునం:

ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూరుస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

తులా:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలు పొందుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

ఈరోజు ఇతరుల మాటలు మనసు నొప్పిస్తాయి.ఈరోజు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

తాజా వార్తలు