తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 13, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.

ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.తరచూ మేమేలని మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీరు అంటే గిత్తని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చ చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తాజా వార్తలు