తెలుగు 'యాక్షన్‌' ఫలితం ఏంటో తెలుసా?

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ నటించిన యాక్షన్‌ చిత్రం రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల నడుమ హాలీవుడ్‌ యాక్షన్‌ సీన్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

విశాల్‌కు జోడీగా తమన్నా నటించింది.తమన్నా మరియు విశాల్‌ల రొమాన్స్‌ కూడా ఈ సినిమాలో మాస్‌ ఆడియన్స్‌ను అలరిస్తుందంటూ అంతా నమ్మకంగా చెప్పారు.

దాంతో ఈ సినిమాను తెలుగులో ఏకంగా ఏడున్నర కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

Telugu Action Movie Results

సినిమా విడుదలై రెండు వారాలైంది.దాదాపుగా ఫుల్‌ రన్‌ కంప్లీట్‌ అయ్యింది.ఇలాంటి సమయంలో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌ చూస్తే అంతా అవాక్కవుతున్నారు.

Advertisement
Telugu Action Movie Results-తెలుగు యాక్షన్‌#8217; �

ఏడున్నర కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే సినిమా కేవలం రెండున్నర కోట్లు మాత్రమే రాబట్టిందట.దాంతో సినిమాకు అయిదు కోట్ల వరకు నష్టం వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

పందెం కోడి 2 సినిమాతో మంచి వసూళ్లను రాబట్టిన కారణంగా ఈ సినిమాతో కూడా తప్పకుండా ఆకట్టుకుంటాడని అంతా అనుకున్నారు.

Telugu Action Movie Results

కాని విశాల్‌ ఈ సినిమాలో యాక్షన్‌ తప్ప మరేం లేదు అంటూ తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.అయితే తమిళంలో ఈ సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది.మొదటి వారం రోజుల్లో అక్కడ పెద్దగా పోటీ లేకపోవడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి అక్కడ కూడా కలెక్షన్స్‌ ఏమీ కనిపించడం లేదు.అక్కడ లాభ నష్టాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

మానసిక ప్రశాంతతను పొందేందుకు ఈ ఆసనాలు అతి ముఖ్యం..
Advertisement

తాజా వార్తలు