తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు5, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.57

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.49

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.20 ల642

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 05 Monday 2024 , Au

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 2.46 ల3.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 05 Monday 2024 , Au

ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.స్థిరాస్తి వివాదాలలో ఒక కొల్లిక్కి వస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

దీర్ఘకాలిక రుణాలు తీర్చాగలుగుతారు.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.

ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం:

ఈరోజు ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.ఇంటాబయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.

కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చేయలేరు.

కర్కాటకం:

ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

బంధు మిత్రులకు శుభకార్య ఆహ్వానాలు అందిస్తారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

సింహం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి.కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య:

ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కారదిశగా సాగుతాయి.చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

తుల:

ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృశ్చికం:

ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

మకరం:

ఈరోజు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి.వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి.

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు.

కుంభం:

ఈరోజు ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలోఅధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.

మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు